తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి
గృహ వైద్యము - 10
తెల్ల వెంట్రుకలు :
ఆశ్వీయుజ మాసమునందు ప్రతినిత్యము 1 నుండి 2 గ్రాముల కరక్కాయ పొడిని తేనె అనుపానముగా దినమునకు రెండుమారులు సేవించుచున్నచో తెల్లవెంట్రుకలు నల్లబడును.
ఊడుగ పువ్వులు, గుంటగలగర ఆకు, కలువ దుంపలు సమాన భాగమలుగా తీసుకొని మెత్తగా నూరి రెట్టింపు నువ్వుల నూనె కలిపి తైలపక్వముగా కాచి వడకట్టుకొని ఆ తైలమును వంటికి మరియు శిరస్సుకు మర్దన చేసుకొనుచున్న ఎడల తెల్లవెంట్రుకలు నల్లబడును.
కామంచి గింజలు, నల్లనువ్వుల సమభాగములుగా తీసుకొని గానుగలో వేసి తైలము తీయవలెను. ఆ నూనెను తలకు రాసుకొనుచున్న ఎడల తెల్లవెంట్రుకలు నశించుటయే గాక అన్ని రకములైన తలనొప్పులు కూడా తగ్గిపోవును.
ఊడుగ కాయలు

తుమ్ముల రోగము :
నాలుగు చుక్కల నువ్వుల నూనె చెవిలో వేసి దూది పెట్టి వేడినీళ్లతో తలస్నానము చేయుచుండిన ఎడల అతిగావచ్చే తుమ్ముల రోగము తగ్గిపోవును.
గులాబీ పూవులు వేసి కాచి వడగట్టిన నువ్వుల నూనె 2 నుండి 3 చుక్కలు ముక్కులో వేయుచుండిన అతిగా తుమ్ములు వచ్చు వ్యాధి రెండు, మూడు రోజులలో తగ్గిపోవును.
తెల్ల కుసుమ (తెల్ల బట్ట) :
ఉసిరికాయ గింజలోని పప్పును 2 గ్రాములు మంచినీళ్లతో కల్కము వలె నూరి పటికబెల్లపు పొడిని అవసరమైనంత కలిపి ప్రతిరోజూ ఒకసారి చొప్పున నలభయి రోజులు సేవించినచో తెల్లబట్ట వ్యాధి హరించును.
ఉలవలతో కట్టు కాచుకొని ప్రతిరోజూ త్రాగవలయును.
దొండతీగ ఆకుల రసము రెండున్నర తులములు (30 మి.గ్రా.) జీలకర్ర చూర్ణము పావుతులము (3 గ్రా.) కలిపి పూటకొక్క మోతాదుగా రోజుకు రెండుపూటలా పుచ్చుకొనుచున్న ఎడల తెల్లబట్ట వ్యాధి హరించును

Comments

Popular posts from this blog