ప్రేగులను శుభ్రపరిచి, బరువు తగ్గించే ఫైబర్ రిచ్ ఫుడ్స్…
– ఫైబర్ ఫుడ్స్: ఓట్స్, హోల్ గ్రెయిన్స్, మైజ్, బార్లీ, గోధుమలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మొదలగు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రేగుల్లోని వ్యర్థాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రపరుస్తాయి. ఈ ఫైబర్ ఫుడ్స్ ప్రేగుల్లో చేరడం వల్ల ప్రేగుల్లో బౌల్ మూమెంట్ మీద ఒత్తిడి పెంచుతుంది. మరియు ప్రేగుల్లోని నీటితో చేరి స్టూల్ ను స్మూత్ గా మార్చుతుంది. దాంతో బౌల్ మరింత సులభతరం అవుతుంది.
– ఆపిల్స్: పేగులను శుభ్రపరచడానికి మరియు మలబద్దకం నివారించడానికి ఆపిల్స్ బాగా సహాయపడుతాయి. ఆపిల్స్‌లో అద్భుతమైన క్లెన్సిమగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. బౌల్ మూమెంట్ పెంచుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఆపిల్స్‌ను అధికంగా తీసుకోవాలి. ఆపిల్స్‌లో పెక్టిన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మొదలగునవి అధికంగా ఉండటం వల్ల నీరు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది మరియు బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది.
– అరటిపండ్లు: అరటిపండ్లలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో క్లెన్సింగ్ ప్రొపర్టీస్ కూడా అధికమే. అరటిపండ్లు రెగ్యులర్ గా తీసుకుంటుంటే డైజెస్టివ్ సిస్టమ్ మంచి కండీషన్లో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల పేగులను శుబ్రపరచుకోవడంతో పాటు ఫిట్‌గా ఉండవచ్చు. అరటిపండ్లు బెస్ట్ కోలన్ క్లెన్సింగ్ ఫుడ్స్ గా చెప్పవచ్చు.
– పేగులను శుభ్రపరచడంలో మరో బెస్ట్ ఫుడ్ పెరుగు: పెరుగులో మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్) అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి పెరుగు చాలా బాగా సహాయపడుతుంది. మరియు ఇది ప్రేగులను శుభ్రపరిచి కోలన్ కాన్సర్‌ను నివారిస్తుంది.
– పాలు: పాలను ఎవరైతే సులభంగా జీర్ణించుకోగలరో అలాంటి వారిలో పేగులు చాలా సులభంగా శుభ్రపడుతాయి. పాలలో కొద్దిగా లాక్సేటివ్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇది మలబద్దకాన్ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. పాలు పేగుల్లో చేరిన జీర్ణం కానీ ఆహారాలు మరియు టాక్సిన్స్ ను శుభ్రం చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు పాలు మరియు తేనె తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడుతాయి.
– వెల్లుల్లి: వెల్లుల్లి తినడం వల్ల అనేక ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది మరియు ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పేగులను శుభ్రపరిచి టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హైబ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తుంది.

Comments

Popular posts from this blog