ఐస్‌క్యూబ్‌తో జిడ్డు చర్మానికి చెక్ పెట్టండి
చర్మం జిడ్డుగా ఉందని రకరకాల క్రీములు వాడడం కంటే ఇంట్లో లభ్యమైన ఆహార పదార్థాలతో జిడ్డును పూర్తిగా తొలగించవచ్చు. ఎలాగో చూద్దాం!
తెల్లసొనలో ఉండే ఎంజైములు చర్మంలోని జిడ్డుని బాగా తగ్గిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు, టోనింగ్ కూడా చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నిరోధిస్తాయి. తెల్లసొనను బాగా గిలకొట్టి ముఖం మొత్తానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో ముఖాన్నికడుక్కోవాలి. దీనివల్ల చర్మం మెరుపుని సంతరించుకొంటుంది.
ఐస్‌కు చర్మాన్ని బిగుతుగా ఉంచే గుణం ఉంది. అంతేకాక మూసుకుపోయిన చర్మాన్ని తెరుచుకునేలా చేస్తుంది. దానితో పాటు ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ముందుగా మీరు ముఖాన్ని బాగా కడిగి, శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ ముక్కలను పలచటి గుడ్డలో వేసి సాగిన చర్మ రంధ్రాల దగ్గర కొన్నినిమిషాలు ఉంచి మర్దన చెయ్యాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద చర్మం బిగుతుగా తయారవుతుంది.
ముఖం మీదున్న జిడ్డును పోగొట్టడంలో టమాటో జ్యూస్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని సూక్ష్మరంధ్రాలను శుభ్రం చేస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా తయారవుతుంది. అందుకే టమాటో జ్యూస్‌ని ముఖం మీద రాసుకుని మర్దన చేసుకొని ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటా మంచి క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది.
Comments
Post a Comment