వరిబీజం ( బుడ్డ ) హరించుటకు రహస్య సిద్ద యోగాలు -
ఈ మధ్యకాలంలో కొంతమంది వరిబీజంతో బాధపడుతున్న వారు కి చికిత్స చేయడం జరిగింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కోరకమైన చికిత్స ప్రయొగించాను. కొందరిలో ఫలితం చాలా తొందరగా వచ్చింది. ఆ యోగాలు మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను . ముఖ్యంగా కొంతమంది లావెక్కిన వృషణానికి నీరు తీయాలి అని మోటు వైద్యం చేస్తున్నారు . దానివలన లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది పూర్తిగా వాతసంబంధమైన సమస్య .కావున సరైన మరియు సురక్షిత చికిత్సలు తెలియచేస్తున్నాను .
సిద్ద యోగాలు -
* చింత చిగురుని మెత్తగా రుబ్బి బుడ్డ పైన పట్టు వేయవలెను . ఇది రాత్రిపూట మాత్రమే చేసిన చాలు ఇలా 4 నుంచి 5 రోజులు చేయవలెను . ఆహారంతో మంచినీరు తక్కువ తాగవలెను .
* జిల్లేడు ఆకుకి ఆముదం రాసి వెచ్చచేసి బుడ్డపైన వేసి కట్టవలెను . ఈ విధంగా 5 నుంచి 6 రోజులు చేసిన బుడ్డ హరించును .
* జాజికాయ చూర్ణం గోరువెచ్చటి ఆముదంలో కలిపి వృషణానికి పట్టులా వేసినచో వరిబీజం తగ్గును.
పైన చెప్పిన యోగాల ఫలితాలు రావడానికి కొంతమందికి కొంచం సమయం ఎక్కువ పట్టొచ్చు. అయినను విడవకుండా వాడవలెను.
Comments
Post a Comment