మలబద్ధకం నివారణ*
*********************
మనందరం ఎప్పుడో ఒకసారి మలబద్ధకం తో ఇబ్బంది పడే వుంటాం...
గట్టిగా బిగపట్టి గంటలు తరబడి టాయిలెట్లో గడపటం చాలా మందికి అనుభవం...
మలబద్దకం అనగా మలము వచ్చు మార్గములో అడ్డంకి లేదా ఇబ్బంది కలగటం. దీనికి ప్రధాన కారణం శరీరంలో అపానవాతం అను వాతదోషం ప్రకోపించట‌ం...
శరీరంలో చెడు పదార్దాలను మలంగా ఎప్పటికప్పుడు బయటకు పంపటం అపాన వాతం యొక్క విధి, అలా కాకుండా ఓకే చోట ఎక్కువ కాలం చెడు పదార్దాలు నిల్వ ఉండటం వలన మరిన్ని విపరీత రోగాలు వచ్చే అవకాశం వుంది...
ముఖ్య‌ంగా మలద్వారంలో రక్తనాళాలు ఉబ్బటం వలన పైల్స్, పక్షవాతం, కీళ్ళ వాతం, మైగ్రేన్, స్ట్రెస్, అలసట, నడుము నొప్పి, రేక్ఠల్ కాన్సర్ వంటివి వచ్చు అవకాశం వుంది కావున సరైన సమయంలో వైద్యం తప్పనిసరి...
*మలబద్ధకం అధికంగా వుండే వారు పాటించాల్సి‌న నియమాలు...
- ఎక్కువుగా నీళ్ళుతాగటం లేదా రెండు గంటలకు ఒకసారి వేడి నీళ్ళు తాగటం వలన ఉపశమనం పొందవచ్చు...
-ఉదయం పరకడుపున వేడిపాలు తాగటం వలన ఉపశమనం పొందవచ్చు...
-పరకడుపున వేడి నీళ్లల్లో రెండు టీ స్పూన్ల ఆముదం కలిపి తాగిన తగు ఉపశమనం పొందవచ్చు...
-ఎక్కువుగా పీచు పదార్దాలు ఐన పళ్ళు , కూరగాయలు తీసుకోవాలి, తేలికగా జీర్ణం అయ్యే పదార్దాలు తీసుకోవటం మంచిది...
-ఓకే చోట ఎక్కువగా కూర్చోకుండా కొంచెం శారీరక వ్యాయామం తప్పనిసరి...

Comments

Popular posts from this blog