ఆకర్షణీయమైన పెదాలకు పర్‌ఫెక్ట్ లిప్ స్టిక్ మరియు లిప్ లైనర్…
1. ఆకర్షనీయమైన పెదాల కోసం మన్నికైన లిప్ స్టిక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అందుకు మంచి కలర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంచుకొనే లిప్ స్టిక్ నేచురల్ కలర్ అయ్యుంటే, సహజ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ రాత్రి సమయంలో మాత్రమే ఉపయోగపడుతాయి. మ్యాట్ ఫినిష్ నిచ్చే లిప్ స్టిక్స్ పగలు అందంగా కనబడేలా చేస్తే, స్టెయిన్ మరియు గ్లాస్ ఫినిష్ సాయంత్రం, రాత్రి వేళల్లో మంచి లుక్ నిస్తుంది.
2. లిప్ స్టిక్, లిప్ లైనర్ ఉపయోగించడానకి ముందుగా మీ మేకప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరగా లిప్ స్టిక్, తర్వాత లిప్ షేప్ కోసం లిప్ లైనర్‌ను ఉపయోగించాలి.
3. అలాగే పెదాలకు కొద్దిగా లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం వల్ల పెదాలు తడిగా ఉంటాయి.
4. పెదాలకు లిప్ స్టిక్ రాసుకొన్న తర్వాత పెదాలా ఆకృతి కోసం లిప్ లైనర్‌ను లిప్ స్టిక్ కంటే కొంచెం డార్క్‌గా ఉన్నవాటితో ఔట్ షేప్‌ను గీయాల్సి ఉంటుంది. పెదాలపైన కొంచెం మందంగా లిప్ లైన్ పెన్సిల్‌తో గీసుకొని చివర్లు వచ్చేసరికి సన్నగా ఔట్ లైన్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. నోటిని తెరచి సన్నని పెదాలపై లిప్ లైనర్‌తో ఔట్ లైన్ గీసుకోవాలి. పెదాలపై పూర్తిగా ఔట్ లైన్ గీసుకొన్న తర్వాత పెద్దాలు నిండుగా కనిపిస్తాయి.
6. లిప్ స్టిక్‌ను ట్యూబ్‌తో లేదా లిప్ స్టిక్ బ్రెష్‌తో అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత పైనల్ కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పెదాలు మరింత అందంగా కనబడుతాయి.
7. పై పెదవి, క్రింది పెదవి పైన ఎక్స్‌ట్రా లిప్ స్టిక్ ఏమైనా కనబడితే కాటన్ బాల్స్ తీసుకొని తుడిచేసుకోవాలి.
8. తక్కువ విలువ, మన్నిక లేని, లిప్ స్టిక్ ఉపయోగించడం వల్ల భోజనం తర్వాత లిప్ స్టిక్ వాటర్ బాటిల్స్, టీ కప్పుకు, అంటుకోవడం గమనించాలి.
Comments
Post a Comment