బ్రేక్ ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేశారో.. అంతే సంగతులు.. ఉడికించిన గుడ్డును?
అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఆరగించవచ్చు. మధ్యాహ్నం, రాత్రి పూట అలా తీసుకోవడం బాగానే ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్‌ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలునని వారు చెప్తున్నారు.
అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరతాయి. వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టకి ఇబ్బందిని కలిగిస్తుంది.
ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోవడం మంచిది. తాజా పండ్ల రసాలు గ్లాసుడు అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఉదయం... మధ్యాహ్నం... రాత్రి.... ఏం తీసుకోవాలి...?
రోజులో 24 గంటలు. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు ఉరుకులు పరుగులే. ఇదీ నేటి యువత జీవనమయం. ఈ క్రమంలో వేళకు సరైన భోజనం చేయరు. ఆ సమయానికి ఏదో ఒకటి లాగించేస్తుంటారు. తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకు నచ్చినట్టు, తమకు వీలుపడిన సమయంలో ఏ ఆహారం అంటే ఆ ఆహారాన్ని తీసుకుంటుంటారు. మరికొందరు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు. కానీ, అన్నపానీయాల విషయంలో సమయ నియమాలు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. అలా ఎందుకు చేయాలో ఓ సారి పరిశీలిద్ధాం.
సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే అల్పాహారం, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రుళ్లు విశ్రాంతికి వెళతాం గునుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్‌లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలు, సలాడ్ ఎక్కువ తీసుకోవాలి

Comments

Popular posts from this blog