కివీ పండులో ఏముంది?
న్యూజిలాండ్‌ పండుగా పేరొందిన కివీ, ఇటీవల మనదేశంతోబాటు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతోంది. ఇందులో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. పైగా మిగిలిన పండ్లతో పోలిస్తే సి-విటమిన్‌ శాతం చాలా అధికం. ఒక పండు నుంచి 42 క్యాలరీల శక్తితోబాటు, సుమారు 64 మి.గ్రా. సి-విటమిన్‌, 3 గ్రా. ఎ- విటమిన్‌, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్‌, 2.1 గ్రా.పీచూ లభ్యమవుతాయి. ఇంకా విటమిన్‌-ఇ, కెలతోబాటు కాపర్‌, మెగ్నీషియం, కోలీన్‌, ఫాస్ఫరస్‌ కూడా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని అనేక తాజా పరిశోధనల్లో తేలింది.
* కివీ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుంది.
* నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి.
* సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండే ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువని టెన్నెసీ, వాండర్‌బిల్ట్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు.
* పొటాషియం కారణంగా పక్షవాత ప్రమాదం తగ్గడంతోబాటు ఎముక సాంద్రత క్షీణించకుండా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ ఉంటాయి. బీపీ కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా కివీ పండులోని జిగురు కారణంగా మలబద్ధకం లేకుండా ఉంటుందట. కాబట్టి మలబద్ధక బాధితులకి ఇది ఎంతో మంచిది.

Comments

Popular posts from this blog