ఇస్నోఫిలియా, ఉబ్బసానికి పసుపుతో చెక్
* పాలు వేడి చేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేపనూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు, గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని, పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో సాది గానీ కడితే సెగ్గడ్డలు, కురుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేస్తే చర్మరోగాలు మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం, పెరుగు సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి, స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, శెనగ పిండి, పసుపు వేసి బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతాయి.

Comments
Post a Comment