పిల్లలకు కూల్ డ్రింక్స్ వద్దే వద్దు.. పల్చాటి మజ్జిగను తాగిస్తే..?
పిల్లలకు కూల్‌డ్రింక్స్ ఇవ్వడం పూర్తిగా మానేయాలి. వీటితో పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిలోని చక్కెరపాళ్లు ఉదర సమస్యలను ఉత్పన్నమయ్యేలా చేస్తాయి. అలాగే ప్యాక్డ్ ఫుడ్‌ను కూడా పిల్లలకు అలవాటు చేయొద్దు. సహజ పదార్థాల నుంచి తీసిన పానీయాలను తీసుకోవడం మంచిది. పిల్లలకు ఉదర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే.. పల్చాటి మజ్జిగ తాగించాలి. కడుపులో ఎసిడిటీ తగ్గడంతో పాటు జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది. అప్పుడప్పుడు లస్సీ కూడా తాగొచ్చు. ఇందులో పోషకవిలువలు ఎక్కువ.
రుచికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. చివరగా అన్నిటికంటే ముఖ్యమైనవి మంచినీళ్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లెయిన్ ఫిల్టర్ వాటర్ తాగే విధంగా పిల్లలకు అలవాటు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలకు పుచ్చకాయ, మామిడి, బత్తాయి, ఆపిల్ జ్యూస్‌లు బెటర్. శీతాకాలానికి అనుకూలంగా ఈ జ్యూస్‌లను ఎన్నుకోవాల్సి వుంటుంది. అలాగే బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఆల్మండ్ మిల్క్ బెస్ట్. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం. తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలు సోయామిల్క్ తాగాలి. సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధికం. పిల్లల శారీరక ఎదుగుదల వేగవంతంగా వృద్ధి చెందుతుంది.
Comments
Post a Comment