రోజూ వంటల్లో చిటికెడు పసుపు చేర్చితే పొందే అద్భుత ప్రయోజనాలు…

రోజూ వంటల్లో చిటికెడు పసుపు చేర్చితే పొందే అద్భుత ప్రయోజనాలు…
– జీర్ణశక్తిని పెంచుతుంది: పసుపు బైల్ ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ ను పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది. చిటికెడు పసుపును పాలలో లేదా నీళ్ళలో మిక్స్ చేసి తాగడం వల్ల జీర్ణశక్తి మరింత పెరుగుతుంది.
– జలుబుతో పోరాడుతుంది: పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది జలుబు, దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చిటికెడు పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లేదా వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
– గాయాలు నయం అవుతాయి: ఇందులో యాంటీబ్యాక్టియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. గాయాలైనప్పుడు, గాయల మీద చిటికెడు పసుపును అప్లై చేయడం వల్ల త్వరగా నయం అవుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.
– క్యాన్సర్ ను నివారిస్తుంది: పసుపులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రెగ్యులర్ గా వండే వంటల్లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల కోలన్, ప్రొస్టేట్, బ్రెస్ట్ ,క్యాన్సర్ల ను నివారిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది.
– ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గిస్తుంది: పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి పసుపును రెగ్యులర్గా వంటల్లో చేర్చుకోవడం వల్ల ఆర్థ్రైటిస్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
– డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది: పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి, దాల్, కర్రీస్, రైస్ వంటి వాటిల్లో చిటికెడు పసుపు చేర్చుకోవడం మంచిది.
– కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది: మీ డైలీ డైట్ లో చిటికెడు పసుపు చేర్చడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతుంది. ఇది రీసెర్చ్ ద్వారా నిర్ధారించబడినది. రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.
– కాలేయ వ్యాధులను నివారిస్తుంది: పసుపులో ఉండే కుర్కుమిన్ కాంపౌండ్ యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆల్కహాల్, ఫ్యాటీ ఫుడ్స్ వల్ల లివర్ కు ఎఫెక్ట్ కాకుండా సహాయపడుతుంది.

Comments

Popular posts from this blog