పనసతో పలు ప్రయోజనాలు..!
పనస పండును తేనెతో కలిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి. వాత, పిత్త వ్యాధులు దూరమవుతాయి. పనసలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు, ఆరోగ్యానికి బలాన్నిస్తుంది. నరాలను బలపరుస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటువ్యాధులను దూరం చేస్తుంది. అలాగే పనస వేర్లతో చేసిన పొడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌ సి పుష్కలంగా ఉండే పనసను మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ కారకాలను దూరం చేసుకోవచ్చు మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రించే పనసలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అజీర్తిని దూరం చేసుకోవచ్చు. కంటి దృష్టిని మెరుగుపరుచుకోవచ్చు.
కోలన్‌ క్యాన్సర్‌ను నయం చేసే జాక్‌ ఫ్రూట్లో(పనసలో) ఉండే యాంటీ-యాక్సిడెంట్లు పైల్స్‌ను దరిచేరనివ్వదు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పనస పండు పైల్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా పనసలోని విటమిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. యాంటీ ఏజింగ్‌ లక్షణాలను దూరం చేస్తుంది. ఇంకా పనస సౌందర్యానికి వన్నెతెస్తుంది. ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Comments

Popular posts from this blog