మధుమేహ రోగుల పుండ్లు ( గాంగ్రిన్ ) నయం చేయుటకొరకు అద్బుత ఔషదం -
చండ్ర చెక్క 10 గ్రాములు , త్రిఫలాలు 10 గ్రాములు ఈ రెండింటిని నలగగొట్టి పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా తాగుతుంటే క్రమంగా వ్రణాలలోని కుళ్లు హరించి పోయి వ్రణాలు మాడిపోతాయి . అదేవిదంగా చండ్ర చెట్టు బెరడు 20 గ్రాములు తీసుకుని 200 గ్రాములు నీటిలో వేసి నాలుగోవంతు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి ఆ కషాయంలో దూది ముంచి ఆ వ్రణాలను కడగాలి. తరువాత ఇదే చెట్టు బెరడు పొడి పొగని వ్రణాలకు పట్టి అదే విధంగా మంచినీటితో ఆ చెట్టు బెరడు అరగదీసి వచ్చిన చండ్ర చెట్టు గంధాన్ని పైన లేపనంగా రాయాలి .
ఈ విధంగా చేయడం వలన పురుగులు పట్టిన వ్రణాలు సైతం పురుగుల చచ్చి పడి వ్రణాలు మానిపోతాయి . ముఖ్యంగా మదుమేహ రోగులు పుండ్లు పడి గాంగ్రీన్ గా మారి అవయవాలు పోగొట్టుకునే వారికి ఇది వరం .
చండ్ర చెక్క చూర్ణం వాడవచ్చు . అదే విధంగా త్రిఫలాల బదులు త్రిఫలా చూర్ణం వాడవచ్చు
Comments
Post a Comment