నెయ్యి వాడకం వలన ప్రయోజనములు .
హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..
“నెయ్యా! అమ్మో! వద్దు.. బరువు పెరుగుతాం, ఒళ్ళొచ్చేస్తుంది”.. నూటికి 90 శాతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఎందుకంటే జనం కూడా నెయ్యిని కొలెస్ట్రాల్ కి ప్రతిరూపంలా ఫీలవుతున్నారు. చాలామంది టీవీల్లో చెప్పేవి.. పుస్తకాల్లో, పేపర్లలో రాసేవి చూసి, సగం సగం నాలెడ్జ్ తో నమ్మేసి అదే నిజం అనుకుని, గుండెజబ్బులనేవి నెయ్యి తినడం వల్లే వస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు. ఇవేమీ నిజం కాదు. ఆయుర్వేదం ‘నెయ్యి’ అమృతంతో సమానం అని చెప్పింది. అంతేకాదు మోడ్రన్ సైన్స్ కూడా నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయని రీసెర్చ్ చేసి మరీ చెప్పింది..
నెయ్యిలో ఉండే ఈ రెండూ K2 , CLA (Conjugated Linoleic Acid) యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అని ఎంతమందికి తెలుసు.
నెయ్యి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోవడమే కాదు ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. నెయ్యి వల్ల గ్యాస్ సమస్యలు ఉండవు. దృష్టి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, నెయ్యిని తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విటమిన్ “ఎ” పుష్కలంగా లభించి నేత్ర సమస్యలు తగ్గుముఖం పడతాయి.
నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహ ఉంది. అయితే నిజానికి నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు.. నెయ్యి మంచి కొలెస్ట్రాల్ నే పెంచుతుంది. అందువల్ల నెయ్యివల్ల గుండజబ్బులు రావు. గుండెజబ్బులకి వేరే కారణాలు కీలకం కావచ్చు. గర్భిణీ మహిళలైతే నెయ్యిని కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే ఎన్నో పోషకాలు గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే పిల్లలకి లభిస్తాయి.
నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని పలు పరిశోధనలు నిర్ధారించాయి. ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు, మొటిమలు కూడా పోతాయి. ముఖం మీద వచ్చే ప్రతివాటికీ నెయ్యి కారణం అని మాత్రం అనుకోవద్దు. బరువు తగ్గాలనుకునే వారు కూడా నిర్భయంగా నెయ్యిని తినవచ్చు. అయితే అతి అనర్ధదాయకం.
నెయ్యిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ వల్ల నెయ్యిని తింటుంటే శరీరంపై అయిన గాయాలు, పుండ్లు తగ్గడమే కాదు రకరకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందi
Comments
Post a Comment