భోజనం తర్వాత బీట్ రూట్ ముక్కలను బాగా నమిలితే...
బీట్ రూట్ వంటల్లో కాకుండా ఔషధంగా కూడా బాగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత బీట్ రూట్ ముక్కలను బాగా నమలడం వల్ల పళ్ల చిగుళ్లు గట్టిపడతాయి. పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటకు తెస్తుంది బీట్ రూట్. అంతేకాదు ఇది చిగుళ్ల నుంచి రక్త కారడాన్ని నిరోధిస్తుంది.
నోటి నుంచి వచ్చే దుర్వాసను అరికడుతుంది. బీట్ రూట్ రసం సేవించడం వల్ల మూత్రకోశ సంబంధిత సమస్యలను దరిచేరనీయదు. తీవ్ర రక్తపోటు, గుండెజబ్బులతో బాధపడేవారికి బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. మొలల వ్యాధి నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

Comments

Popular posts from this blog