*కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు*
మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయం, అనేక రకాల విధులను నిర్వహిస్తుంది.
వాటిలో హిమోగ్లోబిన్ తగ్గడం, ఇన్సులిన్, ఇతర హార్మోన్లు, పాత ఎర్ర రక్త కణాల నాశనం, రక్తం నిర్విశీకరణ, విటమిన్లు, ఐరన్ ల నిల్వ, బైల్ ఉత్పత్తి వంటివి కొన్ని.
మానవ శరీరంలో కాలేయానికి గొప్ప ప్రాధాన్యత ఉంది, ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు.
ఆహరం, పర్యావరణ కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే దీని ప్రభావం మొత్తం శరీర ఆరోగ్యం మీద ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే అనేక ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి, కాలేయం పట్ల మంచి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
ఇపుడు, సాధారణంగా పనిచేయడానికి కాలేయం నుండి టాగ్జిన్స్ ని తొలగించడం చాలా తేలిక. ఇంట్లో తయారుచేసే సహజ పరిష్కారాలను ఉపయోగించడమే దీనికి మంచి మార్గం.
అందువలన, ఈ వ్యాసంలో, వంటింటి వస్తువులను ఉపయోగించి కాలేయాన్ని డిటాక్సిఫై చేసే ప్రభావవంతమైన కొన్ని మార్గాలను,మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి.
కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు
పసుపు: అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పసుపు అద్భుతమైన మూలిక. పసుపు కాలేయం లోని ఎంజైమ్ లను ఉత్తేజపరిచి, శరీరం నుండి కార్సినోజెన్స్ ను సమర్ధవంతంగా బైటకు పంపుతుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ లివర్-డిటాక్స్ ఏజెంట్. గ్రీన్ టీ లో యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. కాలేయం నుండి టాగ్జిన్స్ ని బైటికి పంపడానికి ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ఉత్తమ మార్గం.
కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు
అవోకడోలు: పాడైపోయిన కాలేయాన్ని మరమ్మత్తు చేసే సామర్ధ్యం అవోకడోలకు ఉంది. ఇది టాగ్జిన్లకు వ్యతిరేకంగా కాలేయాన్ని రక్షించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆహారంలో అవోకడో లను జోడించి తేడాను గమనించుకోండి.
పాలకూర: కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత శక్తివంతమైన ఆహార పదార్ధాలలో పాలకూర ఒకటి! పాలకూర గ్లుటాథయాన్ కి మంచి వనరు, ఇది ఎంజైమ్ లను ఉత్తేజపరచడం ద్వారా కాలేయాన్ని సమర్ధవంతంగా శుభ్రపరుస్తుంది.
Comments
Post a Comment