బాదం 250 గ్రాములు .
సోంపు 250 గ్రాములు .
పటికబెల్లం 250 గ్రాములు చిప్స్
బాదం రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి ఎండించాలి . బాగా ఎండిన తరువాత మెత్తటి పౌడర్ కొట్టవలెను.
సోంపు కొంచం వేయించి మెత్తగా పౌడర్ కొట్టవలెను.
పటికబెల్లం మెత్తటి పౌడర్ కొట్టవలెను.
మూడింటిని కలిపి ఉదయం , సాయంత్రం ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగవలెను.
చిన్నపిల్లలకి 1 స్పూన్ , పెద్దవారికి 2 స్పూన్స్ చొప్పున వాడవలెను.
షుగర్ లేనివారు పటికబెల్లం 50 గ్రాములు పెంచుకొన్నా పర్వాలేదు .
శరీరంలో నీరసం, నిస్సత్తువ పోయి శరీరానికి చాలా బలం కలుగును . 6 నెలలు విడవకుండా వాడిన అద్భుత ఫలితాలు వస్తాయి.

Comments

Popular posts from this blog