*రోజూ యాలకుల టీ తాగితే కలిగే లాభాలివే తెలుసా..?*☕
*యాలకులను మనం తరచూ పలు వంటకాల్లో వేస్తామని అందరికీ తెలిసిందే. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తారు.*
*దీంతో ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే యాలకుల వల్ల మనకు ఇవే కాకుండా పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.*
*ముఖ్యంగా రోజూ టీలో కొన్ని యాలకులను వేసుకుని మరిగించి తాగితే దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం*.
*1. రోజూ యాలకుల టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.*
*2. యాలకుల్లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోట్లో ఉండే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన పోతుంది. గొంతు తడి ఆరిపోవడం వంటి సమస్యలు రావు. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.నోటి పూత తగ్గుతుంది.*
*3. ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలతో సతమతమయ్యే వారు ఒక కప్పు యాలకుల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాల్లో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి. ముక్కు రంధ్రాల్లో ఉండే మ్యూకస్ కరిగిపోతుంది.*
*4. యాలకుల టీలో ఉండే సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు చిన్న చిన్న గాయాలను త్వరగా మానేలా చేస్తాయి*.
*5.తలనొప్పి, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడేవారు యాలకుల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి.*
*6. యాలకుల టీని తరచూ సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది.రక్తం ఎక్కువగా తయారవుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త నాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి.*
*7.శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.*
*8. యాలకుల టీ శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.*
Comments
Post a Comment