(Memory power)
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. మనం తినే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలో ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింత పెరుగుతుంది. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేవెూ గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. ఇలా మరిచిపోయేందుకు కారణం వారిలో పరీక్ష అంటే వున్న భయం, టెన్షన్ కావచ్చు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్లా, భయం వల్లా పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి టెన్షన్లకు పిల్లలు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1. పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. 2. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ మెదడు చలాకీగా పనిచేయాలన్నా, అనారోగ్యం, నిద్రలేమి, ఆందోళన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 3. పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్ బి12, విటమిన్‌బి6, విటమిన్ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పోలేట్ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. 4. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది.
5. నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్ ద్రాక్ష జ్యూస్ తీసుకోవడం ఎంతో మంచిది. 6. అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్, ఆంథోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. కొంతమంది ఆపిల్ తొక్కను తీసేసి పండును మాత్రమే పిల్లలకిస్తుంటారు. ఆపిల్ తొక్కలో కూడా మంచి పోషకాలు ఉంటాయనే సంగతిని మరవరాదు. 7. ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి.
Comments
Post a Comment