తుమ్ములు జలుబు పడిశం
"""""""""""""""""""""""""""""""""""""""
1. అర గ్లాసు వేడిపాలలో ఒక చిటికెడు పసుపు పొడిని కలిపి తీసుకుంటే జలుబు తగ్గును.
2. సొంటి 2 చిటికలు గోరువెచ్చని నీళ్లతో కలిపి నిద్రపోయేముందు త్రాగిన జలుబు తగ్గును.
3. పండినజిల్లేడు ఆకుల రసంలో అవనూనెకలిపి శరీరానికి పూసి ,మర్దన చేసిన జలుబుతగ్గును.
4. ఒక కప్పు నువ్వుల నూనెలో కొన్ని గులాబీ పూలు వేసి బాగా మరిగించి వడపోసుకొని నిల్వచేసుకోవాలి రోజూ
ఉదయం రెండు ముక్కు రంధ్రాలలోకి రెండు చుక్కలు వేసుకుని తుమ్ములు తగ్గిపోతాయి.
5.ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసుకొని రెండు ముక్కులలో రెండుచుక్కలు వేయాలి.
6. చెక్కర నిప్పులపై వేసి పొగ పిలిస్తే జలుబు తగ్గును.
7. వేడినీటిలో కొద్దిగా పసుపు అమృతాంజనువేసి గట్టిగా ఆవిరి పీల్చడం వలన జలుబు తగ్గును.
8. తులసి ఆకులు పది మిరియాలు 5 శొంఠిరెండు చిటికెలు,పటికబెల్లం 1చెంచా గ్లాసు నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించి త్రాగుట వలన దగ్గు జలుబు జ్వరం ఒళ్లు నొప్పులుతగ్గుతుంది.

Comments

Popular posts from this blog