• తినగ తినగ మునగ మేలు చేయు
* భారీగా దిగుమతి చేసుకుంటున్న అమెరికన్లు..
* తమిళనాడులో లక్ష ఎకరాల్లో చెట్లు
బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు.. అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు.. ఏంటో తెలుసా?
..పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే.
అదే.. మునగాకు. ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో ఔషధాల నిధి. పోషకవిలువల గని.
• తమిళ మురుంగై.. ఇంగ్లిష్ మోరింగా
మునగను ఇంగ్లిషులో మోరింగా అని అంటారు.
ఇది మురుంగై అనే తమిళ పదం నుంచి వచ్చింది. తమిళనాట దీనిని విస్తారంగా సేద్యం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తమిళనాట దాదాపు లక్ష పైచిలుకు ఎకరాల్లో మునగ సాగవుతోంది. అక్కడి నుంచి మునగాకు, పొడి, విత్తనాలను అమెరికా ఎక్కువగా కొంటోంది. విదేశాలు వీటిని కాస్మెటిక్స్‌లోనూ, ఔషధాల తయారీలోనూ వాడుతున్నారని చెబుతున్నారు తమిళనాడు కు చెందిన మునగ ఎగుమతి కంపెనీ ఎస్‌వీఎం ఎక్స్‌పోర్ట్స్ యజమాని ఎస్ ముత్తురాజ్. తమిళనాడులోనే కాదు.. ఏపీ, కర్ణాటక, ఒడిసాతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు పెరుగుతాయి. ఘనా, మొజాంబిక్, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్‌లోనూ మునగ పెరుగుతున్నది.

మునగ.. పాశ్చాత్యలకు ఇది మేజికల్ ట్రీ. మన దగ్గర.. ‘అమ్మకు ప్రియనేస్తం’. ఎన్నో పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా.. కనీసం ఆషాఢంలో నైనా తినాలన్నారు పెద్దలు! ఒక్క ఆషాఢం అనే ఏంటి.. తరచూ తినాల్సిన ఆకు అని ఆధునిక వైద్యనిపుణులు అంటున్నారు. అల్లోపతి, ఆయుర్వేదాలు రెండింటిలోనూ మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు.
మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి..
ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి..
ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి..
Comments
Post a Comment