వెన్నునొప్పి ఉపశమనానికి చిట్కాలు…
ఇంట్లో అయినా ఆఫీసులోనైనా కూర్చునే విధానంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నేరుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.ఒకే పొజిషన్‌‌లో కూర్చోవడం మంచిది కాదు.అప్పుడప్పుడు లేచి అలా నడవండి.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వెన్ను నొప్పిని దూరం చేసుకోవాలంటే మోకాలి నొప్పులు లేనట్లైతే కింద సమానంగా కూర్చోవడం వంటివి చేయొచ్చు. రోజూ అర్థగంట వాకింగ్ చేయొచ్చు.ఆహార విషయంలో అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి రోజూ ఆహారంలో ఉపయోగించేలా చూసుకోవాలి. కొవ్వులేని మాంసం, చేపలు, పండ్లు, ఖర్జూరం, పచ్చి బఠాణీలు ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ డి, బి12, ఎ వంటివి అందేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి క్యాల్షిషియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి చేర్చుకోవాలి.

Comments

Popular posts from this blog