*హర్మోన్ల లోపం వల్లే కళ్లకింద నల్లటి చారలు*
పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో చర్మ సంబంధిత జబ్బులు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు నవ్వ, చర్మం పొడిబారడం, కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడటం జరుగుతుంటుంది.
అలాగే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది.
* ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్ల అవసరమౌతుంది. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog