వేసవిలో ఎండకు కమిలి, నల్లగా మారిన చర్మాన్ని.. తెల్లగా మార్చే సింపుల్ టిప్స్…
నిమ్మరసం: నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉంది, ఇది డార్క్ స్కిన్ ను లైట్ గా మార్చుతుంది. నిమ్మరసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అప్లై చేసిన 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళదుంప: బంగాళదుంపలో నేచురల్ బ్లీచింగ్ లక్షనాలు కలిగి ఉన్నాయి. ఇది చర్మ మీద ఎటువంటి ప్యాచెస్ లేకుండా చేస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా చేసి చర్మం నల్లగా మరియు పిగ్నెంటేషన్ తో ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పిగ్మేంటేషన్ నేచురల్ గా నివారించబడుతుంది. అలాగే పొటాటో జ్యూస్ లో నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
పసుపు: పసుపు, నిమ్మరసం శెనగపిండి, మిల్క్ క్రీమ్ మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించాలి. మరింత ఉత్తమ ఫలితాల కోసం రోజ్ వాటర్ ను మిక్స్ చేయవచ్చు. చర్మాన్ని బ్రైట్ గా మార్చుకోవడం కోసం పసుపును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఫేస్ ప్యాక్ లో యాంటీబ్యాక్టీరియల్ పిగ్మేంటేషన్ నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి . పసుపులో కొద్దిగా పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.
బొప్పాయి: పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స. ఎందుకంటే ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించబడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్: పిగ్నెంటేషన్ ను నేచురల్ గా తగ్గించే మరో ఉత్తమ హోం రెమెడీ. కొద్దిగా వెనిగర్ ను నీటిలో వేసి బాగా గిలకొట్టి ముఖానికి అప్లై చేయాలి. వెనిగర్ లో కెమికల్ ఎసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది పిగ్మెంటేషన్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
అలోవెర జెల్: అలోవెర జెల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల పిగ్మేంటేషన్ సమస్య ఉండదు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముకానికి అప్లై చేసి మరుసటి రోజు శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ. అలోవెర జెల్ ను అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
బాదం: బాదంలో ఉండే విటమిన్ ఇ కంటెంట్ డార్క్ స్పాట్స్ ను నివారించడంలో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. బాదంను నీటిలో నానబెట్టి, రెండు గంటల తర్వాత బయటకు తీసి, మెత్తగా పేస్ట్ చేసి, అందులో పాలు లేదా పాలక్రీమ్ వేసి మిక్స్ చేసి చర్మానికి పట్టించాలి. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది.

Comments

Popular posts from this blog