Posts

ఇస్నోఫిలియా, ఉబ్బసానికి పసుపుతో చెక్ * పాలు వేడి చేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది. * సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. * వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి. * పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి. * వేపనూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు, గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది. * పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని, పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో సాది గానీ కడితే సెగ్గడ్డలు, కురుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి. * పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేస్తే చర్మరోగాలు మాయ‌మ‌వుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. * పసుపు, గంధం, పెరుగు సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వ...
మీరు ఉపయోగించే సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ 1.6w/kg కంటే తక్కువ స్థాయిలో ఉంటేనే మీ ఫోన్‌తో పాటు మీరు కూడా సేఫ్ అని అర్థం...ఇంతకు మించి రేడియేషన్ మీ సెల్ ఫోన్‌లో చూపిస్తే...వీలైనంత త్వరగా ఫోన్ మార్చుకోవడమే మంచిదట. ఫోన్‌లో రేడియేషన్ స్థాయిని తెలుసుకోవాలంటే *#07# కు డయిల్ చేస్తే చాలు మీ సెల్ ఫోన్ రేడియేషన్ ఎంతో మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
• ఎండుద్రాక్ష... ఆరోగ్యానికి రక్ష చాలామంది ఎండు ద్రాక్షను మిఠాయిల తయారీలో మాత్రమే వాడుతుంటారు. నిజానికి వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అజీర్తి, రకరకాల కారణాల వల్ల మలబద్దకం బాధిస్తుంటుంది. అలాంటివారు ఎండుద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆ సమస్యా తగ్గుతుంది. దానికి కారణం వాటిల్లో పీచు ఎక్కువగా ఉండటమే. * బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష ఎంతో మేలుచేస్తుంది. వీటిల్లోని గ్లూకోజ్‌ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుత ుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. కుదిరితే వ్యాయామం తరవాత వీటిని తీసుకోవచ్చు. * చిన్నారులూ, క్రీడాకారులూ వీటిని రోజూ తీసుకోవాలి. ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్‌ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. * రోజూ ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, క్యాన్సర్‌ కారకాలూ దూరమవుతాయి. * ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరికి నోటి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటాయి. అలాంటివారు ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి. * అ...
 కివీ పండులో ఏముంది? న్యూజిలాండ్‌ పండుగా పేరొందిన కివీ, ఇటీవల మనదేశంతోబాటు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతోంది. ఇందులో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. పైగా మిగిలిన పండ్లతో పోలిస్తే సి-విటమిన్‌ శాతం చాలా అధికం. ఒక పండు నుంచి 42 క్యాలరీల శక్తితోబాటు, సుమారు 64 మి.గ్రా. సి-విటమిన్‌, 3 గ్రా. ఎ- విటమిన్‌, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్‌, 2.1 గ్రా.పీచూ లభ్యమవుతాయి. ఇంకా విటమిన్‌-ఇ, కెలతోబాటు కాపర్‌, మెగ్నీషియం, కోలీన్‌, ఫాస్ఫరస్‌ కూడా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి దని అనేక తాజా పరిశోధనల్లో తేలింది. * కివీ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుంది. * నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. * సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండే ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువని టెన్నెసీ, వాండర్‌బిల్ట్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. * పొటాషియం కారణంగా పక్షవాత ప్రమాదం తగ్గడంతోబాటు...
1. రోజూ నాలుగు ఖర్జూరాలు తింటుంటే ఎముకలు గట్టిపడతాయి. 2. రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పైన పూస్తుంటే పులిపిర్లు ఊడి పడిపోతాయి. 3. తెగిన గాయాలకు ఆవునెయ్యి పూస్తుంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి. 4. రోజూ పసుపు 3 గ్రాములు, ఉసిరికపొడి 3 గ్రాములు తింటుంటే మధుమేహం హరిస్తుంది. 5. తెలివి తప్పి పడిపోయిన వారి ముక్కుల్లో 3 చుక్కల అల్లం రసం లేదా కుంకుడి రసం వేస్తే తెలివి వస్తుంది. 6. రోజూ వులవ గుగ్గిళ్ళు 100 గ్రాములు తింటూంటే కొవ్వు తగ్గి సన్నబడతారు. 7. అల్లాన్ని గుజ్జులా నూరి ప. ట్టిస్తుంటే చేతుల్లో, కాళ్ళలో పొరలు వూడటం తగ్గిపోతుంది. 8. గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ళ మంటలు హరించిపోవును. 9. కాకరాకు రసం రుద్దుతుంటే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి. 10. జీడిమామిడి చెట్టు బెరడు గంధాన్ని లేపనం చేస్తుంటే ఆనెలు కరిగిపోతాయి.
ప్రేగులను శుభ్రపరిచి, బరువు తగ్గించే ఫైబర్ రిచ్ ఫుడ్స్… – ఫైబర్ ఫుడ్స్: ఓట్స్, హోల్ గ్రెయిన్స్, మైజ్, బార్లీ, గోధుమలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మొదలగు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రేగుల్లోని వ్యర్థాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రపరుస్తాయి. ఈ ఫైబర్ ఫుడ్స్ ప్రేగుల్లో చేరడం వల్ల ప్రేగుల్లో బౌల్ మూమెంట్ మీద ఒత్తిడి పెంచుతుంది. మరియు ప్రేగుల్లోని నీటితో చేరి స్టూల్ ను స్మూత్ గా మార్చుతుంది. దాంతో బౌల్ మరింత సులభతరం అవుతుంది. – ఆపిల్స్: పేగులను శుభ్రపరచడానికి మరియు మలబద్దకం నివారించడానికి ఆపిల్స్  బాగా సహాయపడుతాయి. ఆపిల్స్‌లో అద్భుతమైన క్లెన్సిమగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. బౌల్ మూమెంట్ పెంచుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఆపిల్స్‌ను అధికంగా తీసుకోవాలి. ఆపిల్స్‌లో పెక్టిన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మొదలగునవి అధికంగా ఉండటం వల్ల నీరు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది మరియు బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. – అరటిపండ్లు: అరటిపండ్లలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో క్లెన్సింగ్ ప్రొపర్టీస్ కూడా అధికమే. అరటిపండ్లు రెగ్యులర్ గా తీసుకుంటుంటే డైజెస్టివ్ సిస్టమ్ మంచి కండీషన్లో ఉంటుంది. కాబట్టి ...
వెన్నునొప్పి ఉపశమనానికి చిట్కాలు… ఇంట్లో అయినా ఆఫీసులోనైనా కూర్చునే విధానంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నేరుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.ఒకే పొజిషన్‌‌లో కూర్చోవడం మంచిది కాదు.అప్పుడప్పుడు లేచి అలా నడవండి.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వెన్ను నొప్పిని దూరం చేసుకోవాలంటే మోకాలి నొప్పులు లేనట్లైతే కింద సమానంగా కూర్చోవడం వంటివి చేయొచ్చు. రోజూ అర్థగంట వాకింగ్ చేయొచ్చు.ఆహార విషయంలో అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి రోజూ ఆహారంలో ఉపయోగించేలా చూసుకోవాలి. కొవ్వులేని మాంసం, చేపలు, పండ్లు, ఖర్జూరం, పచ్చి బఠాణీలు ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ డి, బి12, ఎ వంటివి అందేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి క్యాల్షిషియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి చేర్చుకోవాలి.