Posts

పిల్లలకు చేపలు చేసే మేలు ఏమిటో తెలుసుకోండి....* గర్భిణిగా ఉన్నప్పుడు, పసికందులకు పాలిచ్చే సమయంలో చేపలు తినటం వల్ల పిల్లల్లో ఆహారసంబంధం అలర్జీలు అస్తమా, ఎగ్జిమాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయంటున్నారు. పరిశోధకులు, పిల్లల మీద జరిపిన మరో పరిశోధనలో 11 నెలల వయస్సులోపే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలను నియంత్రించవచ్చని కూడా రుజువైంది. అలా చిన్న వయసులోనే ఈ ఆహారాన్ని అలవాటు చేయడం వల్ల వాళ్ల రక్తంలో ఒమేగా 3 లెవెల్స్ ఎక్కువగా ఉండి అలర్జీలను తట్ టుకునే సామర్ధ్యం ఏర్పడుతుందంటున్నారు. పరిశోధకులు పుట్టుకప్పుడు, నాలుగు నెలల వయస్సు పిల్లల్లో ఈ ఫ్యాటీ యాసిడ్ అత్యధిక పరిమాణాల్లో ఉన్నట్లు కూడా వారు గుర్తించారు. ఇందుకు కారణం గర్భణిగా ఉన్నప్పుడు, పాలిచ్చే సమయంలో స్త్రీలు చేపలు ఎక్కువగా తినటమే. ఇలా వారి శరీరం నుంచి పిల్లలకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అందుతోందని పరిశోధకులు గ్రహించారు. ఇదే పరిమాణాన్ని పిల్లలకు 11 నెలల వయసొచ్చే వరకూ కొనసాగించగలిగితే భవిష్యత్తులో అలర్జీ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆవకాశాలు తగ్గుతాయంటున్నారు.
మలబద్ధకం నివారణ* ********************* మనందరం ఎప్పుడో ఒకసారి మలబద్ధకం తో ఇబ్బంది పడే వుంటాం... గట్టిగా బిగపట్టి గంటలు తరబడి టాయిలెట్లో గడపటం చాలా మందికి అనుభవం... మలబద్దకం అనగా మలము వచ్చు మార్గములో అడ్డంకి లేదా ఇబ్బంది కలగటం. దీనికి ప్రధాన కారణం శరీరంలో అపానవాతం అను వాతదోషం ప్రకోపించట‌ం... శరీరంలో చెడు పదార్దాలను మలంగా ఎప్పటికప్పుడు బయటకు పంపటం అపాన వాతం యొక్క విధి, అలా కాకుండా ఓకే చోట ఎక్కువ కాలం చెడు పదార్దాలు నిల్వ ఉండటం వలన మరిన్ని విపరీత రోగాలు వచ్చే అవకాశం వుంది... ముఖ్య‌ంగా మలద్వారంలో రక్తనాళాలు ఉబ్బటం వలన పైల్స్, పక్షవాతం, కీళ్ళ వాతం, మైగ్రేన్, స్ట్రెస్, అలసట, నడుము నొప్పి, రేక్ఠల్ కాన్సర్ వంటివి వచ్చు అవకాశం వుంది కావున సరైన సమయంలో వైద్యం తప్పనిసరి... *మలబద్ధకం అధికంగా వుండే వారు పాటించాల్సి‌న నియమాలు... - ఎక్కువుగా నీళ్ళుతాగటం లేదా రెండు గంటలకు ఒకసారి వేడి నీళ్ళు తాగటం వలన ఉపశమనం పొందవచ్చు... -ఉదయం పరకడుపున వేడిపాలు తాగటం వలన ఉపశమనం పొందవచ్చు... -పరకడుపున వేడి నీళ్లల్లో రెండు టీ స్పూన్ల ఆముదం కలిపి తాగిన తగు ఉపశమనం పొందవచ్చు... -ఎక్కువుగా పీచు పదార్దాలు ఐ...
లేటుగా తిండి తింటే.. నిద్రెక్కడ పడుతుంది.. నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు. అలాగే మద్యం సేవించడం.. శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది.  పగలు కాఫీ టీలు రెండు మూడు కప్పులకంటే ఎక్కువ తీసుకోకండి. నిద్రపోయేందుకు 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు. అలాగే ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు. నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్‌ వంటివన్నీ బంద్‌ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. నిద్రించేందుకు 15 నిమిషాల ముందు అరటిపండు, ఓ గ్లాసుడు పాలు తీసు...
రాత్రి మేల్కొని ఉంటే ఎలాంటి ఆహారం? పెరుగు - అరటిపండు కలిపి తీసుకుంటే... ల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందువరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకునచ్చినట్టు, వీలైన వేళల్లో ఆహారం తీసుకుంటుంటారు. మరికొందరిలో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు రాత్రి వేళల్లో మేల్కొని... ఆసమయంలో తమకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అయితే, ఇలాంటివారు ఎల ాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న అంశంపై పరిశీలిస్తే.. సాధారణంగా అధిక పని కారణంగా రాత్రి నిద్రపోయే అవకాశం ఉండదు. లేదంటే మద్యపానం వల్ల ఉదయం లేచేసరికి తల పట్టేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఏం చేయాలి...? ఇలాంటి సమయంలో టమోటా జ్యూస్ తీసుకోవాలి. ఇది శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేస్తుంది. అలాగే, రాత్రంతా సరిగా నిద్రపట్టకుంటే మర్నాడు ఉదయం బలహీనంగా, నీరసంగా అనిపించడం సహజం. రాత్రిసరిగా నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరిగిపోయి బాగా తినాలనిపిస్తుంది. ఇలాంటివారు డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోవడం ఉత్తమ...
*క్యాబేజీ ఆకుల్ని నమలండి లేదా జ్యూస్ తాగండి.. దగ్గు మటాష్* క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ గ్రంథులు  పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్నివ్వడంతో పాటు వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.
ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...? ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని వాటికి అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు... ఇలా మూడు రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో నల్ల ఉలవలు ఎక్కువ శ్రేష్టం అని శాస్త్రం. మిగత రెండు కూడా వాడుకోవచ్చు. అవి కూడా మంచి ఫలితాలిస్తాయి. ఉలవలు శరిరానికి బాగా వేడిని కలిగిస్తాయి. కానీ వాతాన్ని, జలుబుని, భారాన్నితగ్గించి, శరీరాన్ని తేలికపరుస్తాయి. ఊపిరికుట్టు నొప్పిని తగ ్గిస్తాయి. మూత్రం ఫ్రీగా నడిచేలా చేస్తాయి. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి సహాయపడతాయి. ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే రాళ్ళు త్వరగా కరుగుతాయి. స్త్రీల బహిష్టుకు సంబంధించిన వ్యాధులన్నింటి మీదా ఉలవలు ప్రభావం చూపిస్తాయి. ప్రసవించిన స్త్రీల మైలరక్తం పూర్తిగా బయటకు పోవడానికి ఉలవలు బాగా తోడ్పడతాయి. బహిష్టు అయినప్పుడు ఉలవలు తీసుకుంటే ఋతురక్తం బాగా అవుతుంది. ఇలా ఋతురక్తం సరిగా కానివారు మాత్రమే ఉలవలు తీసుకోవాలి. ఉలవల్ని చారులాగా కాచుకొని తీసుకోవడం వల్ల అనేక రకమైన వ్యాధులను నివా...
ఆవు పాలల్లో,  ఒక లీటరులో :-- 20% క్యాల్షియం వున్నది. యిది ఎముకల సాంద్రతను పెంచును.  15% ఫాస్ఫరస్ ఎముకలు బలంగా, శరీర కణాలకు శక్తి.  11% పొటాషియం రక్త పోటును తగు స్థాయిలో ఉంచును.  15% మాంస కృత్తులు కండర నిర్మాణానికి 15% రోబో ఫ్లేవిన్ ఆహారాన్ని శక్తిగా మార్చును. 10% డి విటమిన్, (క్యాల్షియం మరియు ఇతర ఖనిజ లవణాలను దహించడానికి ఉపయోగం.) 6% విటమిన్ బి 12 యెర్ర రక్త కణాల నిర్మాణానికి. 8% విటమిన్ ఏ కంటి చూపును పరి రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉంచును.